షాకింగ్ ఘటన..ఊయలలోని పసికందు వేలు కొరికేసిన కోతులు

  • మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన
  • ఊయలలో పడుకోబెట్టిన చిన్నారిపై కోతుల దాడి
  • చిన్నారి పెద్ద పెట్టున ఏడవడంతో అప్రమత్తం  
మహబూబాబాద్ జిల్లాలో బుధవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఉయలలో పడుకోబెట్టిన చిన్నారి కాలివేలును కోతులు కొరికేశాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని విరారం గ్రామానికి చెందిన ఏర్పుల లావణ్య, సురేష్ దంపతులకు నెలన్నర పాప ఉంది. లావణ్య మోదుగలగూడెంలోని తన పుట్టింట్లో ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇంట్లో వాళ్లు చిన్నారిని ఊయలలో పడుకోబెట్టి నీళ్లకోసం వెళ్లగా.. కోతులు అకస్మాత్తుగా ఊయల వద్దకు చేరి చిన్నారిపై దాడి చేశాయి. పసికందు వేలును కొరికేశాయి.

ఈ క్రమంలో చిన్నారి పెద్ద పెట్టున ఏడవడంతో అప్రమత్తమైన ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని కోతులను తరిమేశారు. ఆ తరువాత చిన్నారిని వెంటనే మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం.. మెరుగైన వైద్యం కోసం పసికందును వరంగల్‌కు తరలించారు.

Mahabubabad District

More Telugu News